
ఒకటి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఈ నగదు జమ కానుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ జరిగింది. ఏపీ సర్కార్ దీపం2 పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం పింఛన్లను 3000 రూపాయల నుండి 4000 రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు జరుగుతుండగా ఈ పరీక్షల ద్వారా 16347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో 9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలవుతోంది. ఈ నెలలోనే ఏపీ సర్కార్ అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలు చేయనుంది. ఆగష్టు నెల 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలు కానుంది.
రాష్ట్రంలో 8,50,000 ఉద్యోగాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీలో ఎస్సీ వర్గీకరణ సైతం అమలవుతోంది. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 47,456 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కూటమి సర్కార్ పోలవరం, హంద్రీ నీవా ఇతర ప్రాజెక్ట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టడం కొసమెరుపు.