సాధారణంగా విమాన ప్రయాణం అంటే సేఫ్ అని అందరూ భావిస్తారు. విమాన ప్రమాదాలు అరుదుగా మాత్రమే జరుగుతాయనే సంగతి తెలిసిందే. అయితే విమాన ప్రమాదాలు జరిగితే మాత్రం కలిగే నష్టం అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల గగనతలంలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎన్నో సందేహాలు తలెత్తాయి.

సాధారణంగా బోయింగ్ విమానాలు ఇతర విమానాలతో పోల్చి చూస్తే సేఫ్ అని చాలామంది భావిస్తారు.  787 డ్రీమ్ లైనర్ విమానాలు  సుదూర గమ్య స్థానాలకు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లగలవు.  ఈ విమానాలలో  గతంలో సైతం సాంకేతిక  సమస్యలు తలెత్తిన సందర్భాలు అయితే ఉన్నాయి.  అయితే  బోయింగ్ విమానం కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి  అని సమాచారం అందుతోంది.

ఈ విమానాలు ఎంతమేర సురక్షితం అని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.  ప్రజలు ప్రస్తుతం డ్రీమ్ లైనర్ విమానాల గురించి, వాటిలో ప్రయాణిస్తే భద్రతా గురించి ఆరా తీస్తుండటం కొసమెరుపు.  బోయింగ్ అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ కాగా  2000 సంవత్సరం నుంచి  787 డ్రీమ్ లైనర్ విమానాల తయారీ జరుగుతోంది.  ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో  విప్లవాత్మక  మార్పులు  తీసుకొచ్చే ప్రాజెక్ట్ కు  ఈ సంస్థ శ్రీకారం చుట్టింది.

తోలి డ్రీమ్ లైనర్  2009 సంవత్సరం డిసెంబర్ 15న గగనతలంలో చక్కర్లు  కొట్టగా   ఆల్ నిప్పన్  ఎయిర్ వేస్  దీనిని వాణిజ్యపరమైన సేవల కోసం  ఉపయోగించింది.  ఈ సంస్థ విమానాలలో ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ప్రయాణికులు ప్రయాణించారని సమాచారం అందుతోంది.  ఎయిర్ ఇండియా సంస్థ 34 డ్రీమ్ లైనర్ల  ద్వారా సేవలు అందిస్తోంది.  గరిష్టంగా 290 మంది ప్రయాణికులు  ఈ విమానాల్లో  ప్రయాణించే  వీలు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: