
మోదీ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించడంతో పాటు అధికారులను అడిగి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వాళ్ళను పరామర్శించారు. వాళ్లకు ధైర్యం చెప్పడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని మోదీ ఆస్పత్రి యాజమాన్యానికి సూచించారు.
మోదీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో పాటు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోమ్ మంత్రి హర్స్ సంఘవి ఉన్నారు. ఎయిరిండియా సీఈఓ, ఎండీ విల్సన్ సైతం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. నేడు అహ్మదాబాద్ కు బ్రిటిష్ హై కమిషన్ అధికారులు చేరుకోనున్నారు.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. సీనియర్ బీజేపీ నేత విజయ్ రూపానీ సైతం ఈ ప్రమాదంలో మృతి చెందడం గమనార్హం. మెడికోల హాస్టల్ పై విమానం పడగా 24 మంది మెడికోలు సైతం మృత్యువాత పడ్డారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు