
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నేతలు సొంత పార్టీ కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేయడం కొసమెరుపు. ప్రస్తుతం వైసీపీలో కేసులు నమోదు కానీ నేతలెవరు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీలో అంతో ఇంతో గుర్తింపు ఉన్న ప్రతి నేతపై కేసు నమోదైంది. వైసీపీలో ఉంది కేసులు నమోదు కానీ నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళు అదృష్టవంతులు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే వైసీపీపై తప్పుడు కేసులు నమోదు చేయలేదని వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా అన్నీ జరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో వైసీపీ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తే అరాచకం అని వాదించిన కథనాలను ప్రచురించిన పత్రికలూ ఇప్పుడు మాత్రం భిన్నమైన కథనాలను ప్రచురిస్తూ ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
కొన్ని పత్రికలూ, చానెళ్లు వైసీపీ నేతలను మరీ దారుణంగా టార్గెట్ చేస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలపై కేసులు నమోదు కావడం పతాక స్థాయికి చేరిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తప్పు చేస్తేనే కేసులు వేస్తారని తప్పు చేయని పక్షంలో కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏముంటుందని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు