
అయితే 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కూడా కొంతమేరకు స్థానం కలిగింది. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు కు పోటీగా వైసిపి పార్టీ నుంచి జగన్ పోటీ చేశారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆ వెంటనే ప్రతిపక్షంగా వైసిపి పార్టీకి 67 సీట్లు రాగా.. 2019లో 151 యొక్క సీట్లు సింగిల్గానే సంపాదించుకున్నారు. 2024లో బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు కూటమిగా 164 స్థానాలు దక్కించుకున్నారు. ఇలా ఏపీ వాసులు ఎప్పటికప్పుడు విలక్షణమైన తీర్పుతో ముందుకు వెళ్తున్నారు. అలా ఐదేళ్లకు ఒకసారి ఏపీలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.
2024 లో భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. ఎందుకో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మళ్లీ ప్రజలు జగన్ వైపుగానే చూస్తున్నారన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని కి అధికారం ఇచ్చి ఏడాది కాకముందే ఇప్పుడు మళ్లీ జగన్ వైపుగా చూస్తున్నారన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. జగన్ ఎక్కడికి వెళ్లినా కూడా జనాలు తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా వస్తూ ఉన్నారు. ఇటీవలే జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ కు మెల్లగా భారీగా జన సందోహం రావడం జరిగింది కేవలం రెండు కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటలకు పైగా సమయం పట్టింది. దీంతో జగన్ సమర్థత ఎంత ఉందో జనాలలో అర్థం చేసుకోవచ్చు. ఇదే వైసిపి పార్టీకి ఉత్సాహాన్ని ఇస్తోంది. అయితే దీనికంటే ముందు పొదలిలో కూడా జగన్ రాగ వేలాదిమంది జనాలు కూడా అక్కడికి తరలి వచ్చారు.
ముఖ్యంగా జగన్ ఎక్కడికి వెళ్లినా కూడా ఏపీలో జనం కనిపిస్తూ ఉండడంతో అసలు ఏం జరుగుతోందనే విషయం అధికార ప్రభుత్వానికి తలలు పట్టుకునేలా చేస్తోంది. కూటమి మాత్రం ఏపీలో బలంగా ఉందని చెబుతున్న.. కానీ కూటమి ఏర్పడి ఏడాదిలోనే తాము చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నప్పటికీ.. జనం జగన్ కి జేజేలు మాత్రం కొడుతూ ఉన్నట్లు కనిపిస్తోంది.. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కూటమి సరిగ్గా పాలన చేయకపోతే వచ్చే ఎన్నికలలో ఇబ్బందులు కచ్చితంగా వస్తాయనే విధంగా కనిపిస్తోంది.