
గతంలో టిడిపి తరఫున నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా 2014, 19 లో జలవనరుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికలలో మైలవరం సీటు కోసం టిడిపి పార్టీ నుంచి ప్రయత్నాలు చేయక ఆయనకు గుర్తింపు లభించకపోవడంతో సీటు కోల్పోయారు. దీంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దేవినేని ఉమ గత కొంతకాలంగా టిడిపి పార్టీలో సైలెంట్ గా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. 2024 ఎన్నికలలో సీటు ఇవ్వకపోవడంతో పాటుగా ఆ తర్వాత విజయవాడ పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తగా నియమించిన దేవినేని ఉమాకు ఎలాంటి కీలక పదవి లభించలేదట.
ఆర్టీసీ చైర్మన్గా దేవినేని ఉమా పేరు పరిగణంలోకి తీసుకున్న ఎందుకో ఆయనకు పదవి ఖరారు చేయలేదట.అందుకే తీవ్ర సంతృప్తితో ఉన్న దేవినేని ఉమ వైసిపి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్త వినిపిస్తున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా దేవినేని ఉమ సన్నిహితంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి పార్టీలో బలమైన నాయకుడుగా పేరుపొందిన ఉమా వైసీపీ పార్టీలోకి చేర్చుకోవడానికి మరింత బలం అవుతుందని పార్టీలో చేర్చుకోవాలని విధంగా ప్లాన్ చేస్తున్నారట. అయితే గతంలో వైసిపి నాయకులతో విభేదాలు ఉన్నవి మరి.. దీంతో కొంతమంది విభేదిస్తారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితులలో దేవినేని ఉమ వైసిపి పార్టీలోకి చేరుతారా లేదా అన్నది చూడాలి.