ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో టీడీపీ అమలు చేసిన పథకాలు తక్కువనే సంగతి తెలిసిందే. మహిళకు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం మినహా మరే పథకాలు అమలు కాలేదు. అన్నదాత సుఖీభవ నగదు నిన్న అకౌంట్లలో జమవుతుందని వార్తలు వినిపించినా ఆ స్కీమ్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ద్వారా కలిగిన లబ్ది గురించి ప్రస్తావించనున్నారు.

ఈ విషయంలో ఎమ్మెల్యేలు  ఒకింత ధైర్యంగానే ఉన్నారు. అయితే గత ప్రభుత్వ పాలనతో పోల్చి చుస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే.  అందువల్ల ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ ఉండబోతోందనే చర్చ  సైతం సోషల్ మీడియా  వేదికగా జరుగుతోంది.   వాహన మిత్ర, కాపు నేస్తం, నిరుద్యోగ భృతి ఇతర పథకాలకు సంబంధించి  ప్రశ్నలు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది.

ఎమ్మెల్యేలకు ఆ ప్రశ్నలు ఎదురు కావడం సాధ్యమేనా? అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.  అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ధైర్యంగా ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.  సాక్షి దినపత్రిక మాత్రం  కూటమి పాలనలో సంక్షేమ పథకాలు  ఆశించిన స్థాయిలో అమలు  కావడం లేదని అర్హులు సైతం పథకాలు  పొందలేకపోతున్నారని చెబుతోంది.

కూటమి సర్కార్ భవిష్యత్తు  ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో  చూడాల్సి ఉంది.  అన్నదాత సుఖీభవ, మహిళలకు ఫ్రీ బస్  పథకాలను అమలు చేయడం వాళ్ళ  కూటమి సర్కార్ కు మైలేజ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే కావడం కూటమి సర్కార్ కు అన్ని విధాలుగా మేలు  చేస్తోందని అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి.  కూటమి సర్కార్ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: