
హైదరాబాద్ సిటీ బస్సులతో పాటు ఇతర జిల్లాలలోని ఇతర రాష్ట్రాలలో నడిచే బస్సు సర్వీసులకు డిజిటల్ చెల్లింపు విధానాన్ని తీసుకువచ్చింది. దీనివల్ల టికెట్ కు సరిపడే డబ్బులను డిజిటల్ పేమెంట్ చేస్తే చాలు టికెట్ ఇచ్చేలా ప్లాన్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇకమీదట గ్రామీణ ప్రాంతాలలో తిరిగే బస్సులలో కూడా డిజిటల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా చేశారు. ఇందుకు సంబంధించి మరో 10 రోజులలో జీవోలను కూడా జారీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ప్రమాణ సంస్థ తెలియజేసింది.
క్యూ ఆర్ కోడ్ కు పేమెంట్ చెల్లిస్తే..(గూగుల్ పే, ఫోన్ పే) ఇతరత్రా యూపీఐ సేవల ద్వారా కూడా టికెట్ కి సరిపడే మొత్తాన్ని మనం స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా చెల్లించి టికెట్లు తీసుకొని సదుపాయాన్ని ఈ నెలలోనే తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. దీంతో ఇక మీదట బస్సుకు సరిపడే చిల్లర దగ్గర పెట్టుకోవాల్సిన పని లేకుండా డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించి హాయిగా ప్రయాణించవచ్చు..దీనివల్ల బస్ కండక్టర్లకు కూడా కొంతమేరకు తలనొప్పి తగ్గిపోయిందనే భావనను తెలియజేస్తున్నారు. గతంలో కండక్టర్స్ కూడా చిల్లర ఇవ్వాలని వెనుక వైపు రాసేవారు. మరి తెలంగాణలో ప్రవేశపెడుతున్న ఈ పద్ధతి అన్ని రాష్ట్రాలలో ప్రవేశపెడతారేమో చూడాలి.