తెలంగాణ ప్రాంతంలో ఫిరాయింపు  ఎమ్మెల్యేల వ్యవహారం పైన తాజాగా సుప్రీంకోర్టు పలు కీలకమైన తీర్పును తెలియజేసినట్లు తెలుస్తోంది. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పైన అనార్హత పిటిషన్ పై  నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ మూడు నెలలలో తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలను జారీ చేసింది.ఏళ్ల తరబడి ఇలాంటి పిటిషన్లను పెండింగ్లో ఉంచరాదు అంటూ కూడా తెలియజేసింది.



అంతేకాకుండా న్యాయస్థానమే వేటువేయాలి అంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తికి కూడా ధర్మాసనం తిరస్కరించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచి విజయాలను అందుకున్న ఎమ్మెల్యేలు.. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్ వంటి నేతలు అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.


దీంతో వీరి పైన అనర్హత వేటు వేయాలి అంటూ పలువురు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ను కోరడం జరిగింది. కానీ స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు తాజాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మూడు నెలల్లోనే తగిన నిర్ణయం తీసుకోవాలంటు తెలంగాణ స్పీకర్ ఆదేశించింది. మరి ఈ విషయం పైన బిఆర్ఎస్ నేతలు ఏ విధంగా  స్పందిస్తారు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనే విషయం తెలియాల్సి ఉంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కేవలం తెలంగాణలోనే  కాకుండా చాలా ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఇలాంటివి జరగకుండా ఏవైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: