ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి ఫ్రీ బస్సు స్కీమ్ అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ వల్ల మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. అయితే తిరుమల, శ్రీశైలం, పాడేరు రూట్లలో ఎక్స్ ప్రెస్ బస్సులలో సైతం ఫ్రీ బస్సు అమలు కాదని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. ఇలాంటి షరతులు విధించడం ఎంతవరకు రైట్ అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఫ్రీ బస్ అమలులోకి వస్తే కుటుంబాలతో సహా పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే ఆలోచన చాలామందిలో  ఉంది. ఈ నిర్ణయం వల్ల అలాంటి వాళ్ళ ఆశలు అడియాశలయ్యాయి. ఎన్నికల ముందు ఇచ్చే హామీలకు వాటిని  అమలు చేసే తీరుకు ఏ మాత్రం పొంతన లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ రూట్ల విషయంలో ఈ నిర్ణయం రైట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.

ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ ను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల, భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ ను అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది.  కూటమి సర్కార్ ప్రతి పథకానికి సంబంధించి ఈ విధంగా కోతలను అమలు చేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

ఏపీ ఫ్రీ బస్సు స్కీమ్  కు సంబంధించి కూటమి సర్కార్ తప్పు మీద తప్పు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండిపెండెన్స్ డే కానుకగా అమలు కానున్న ఈ పథకానికి ఊహించని స్థాయిలో స్పందన దక్కే అవకాశం అయితే ఉంది.  కోటి మందికి పైగా మహిళలు ఈ పథకం యొక్క బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: