కడప జిల్లాలోని పులివెందుల … ఈ పేరు వినగానే వైసీపీకి “కంచుకోట” అనే ఇమేజ్ గుర్తొస్తుంది. కానీ తాజాగా జరిగిన ZPTC ఉప ఎన్నికలో ఆ ఇమేజ్‌కి పెద్ద బీటలు పడ్డాయి. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినా… ఈసారి అక్కడ వైసీపీకి ఘోర పరాజయం తగిలింది. కూటమి అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి 6735 ఓట్లతో గెలుపొంది, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మాత్రం కేవలం 685 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ షాకింగ్ రిజల్ట్ వెనుక వైసీపీ చేసిన 5 పెద్ద తప్పులు విశ్లేషకుల లెక్కల్లో ఇలా ఉన్నాయి.


1. ఎన్నికను లైట్ తీసుకోవడం
ఎన్నిక మొదలైనప్పటి నుంచి వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. “ఇది మన బస్తీ… ఎలాగైనా గెలుస్తాం” అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌లో మునిగిపోయారు. చనిపోయిన జెడ్పీటీసీ కొడుకుని పోటీలో పెట్టడం వల్ల సానుభూతి ఓట్లు పడతాయని లెక్కలు వేసుకున్నారు. కానీ అదే లెక్క ఫ్లాప్ అయింది.

2. ప్రధాన నేతల గైర్హాజరు
ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జగన్ మామ రవీంద్రనాద్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు ప్రచారం చేసినా… రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతలను ప్రచారానికి దింపకపోవడం ప్రతికూలంగా మారింది.

3. వివేకానంద రెడ్డి జయంతి ప్రభావం
ప్రచార మద్యలోనే వివేకానంద రెడ్డి 74వ జయంతి రావడంతో… ఆయన కూతురు సునీత, సతీమణి సౌభాగ్యమ్మ నివాళులు అర్పించారు. సునీత, తండ్రి హత్యపై చేసిన కన్నీటి వ్యాఖ్యలు, అవినాష్ రెడ్డి పై ఆరోపణలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది వైసీపీకి మైనస్ అయిందని పలువురు చెబుతున్నారు.

4. నేతల వలసలపై దృష్టి లేకపోవడం
పులివెందుల పరిధిలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ వైపు వెళ్లినా… ఆ వలసలను అడ్డుకోవడానికి పెద్దగా ప్రయత్నం జరగలేదు. ఇది కూటమికి అదనపు బలం ఇచ్చింది.

5. జగన్ గైర్హాజరు
సొంత నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారం జరుగుతుంటే కూడా… సీఎం జగన్ అక్కడ అడుగుపెట్టలేదు. ప్రచారం చివరి రోజునైనా జగన్ వస్తాడని వైసీపీ నేతలు ఆశపడ్డారు. కానీ నిరాశే మిగిలింది. జగన్ ఒక్కసారి పులివెందులలో రోడ్ షో చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వైసీపీ లోపలే మాటలు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద… ఓవర్ కాన్ఫిడెన్స్, వ్యూహపరమైన తప్పులు, కీలక నేతల గైర్హాజరు, సునీత వ్యాఖ్యల ప్రభావం, జగన్ దూరంగా ఉండడం… ఇవన్నీ కలిసివచ్చి వైసీపీకి పులివెందులలో చరిత్రలోనే అత్యంత చెడ్డ ఓటమి తెచ్చాయి. ఈ ఫలితంతో కూటమి ఉత్సాహం డబుల్ కాగా… వైసీపీ లోపల మౌనంగా మంటలు చెలరేగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: