భారత్ అమెరికా మధ్య ఎంతో మంచి బంధం ఉంది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆ బంధం మరింత బలపడిందని అందరూ అనుకున్నారు. అంతేకాదు ట్రంప్ కూడా మోడీని పొగుడుతూ భారతదేశం వచ్చి ఇండియాపై అమితమైన ప్రేమను ఒలకబోశారు. కానీ ఇదంతా పెద్ద నాటకమని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. ఆయన ఓవైపు స్నేహం ఉన్నట్టే ప్రవర్తిస్తూ, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ పై విపరీతమైనటువంటి సుంకాలు వేసి కోలుకోకుండా చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని చేసిన అమెరికాకు భారత్ తలోగ్గిది లేదని  మరోసారి నిరూపణ అవుతోంది.  అమెరికా అలా బిర్రుపోకడలు పోతే  చివరికి నష్టపోయేది భారత్ కాదని అమెరికా అని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.. మరి ఈ పరిస్థితులను చూసైనా  ట్రంప్ నిర్ణయం మార్చుకున్నారా? అసలేం జరుగుతోంది అనేది చూద్దాం.. 

అమెరికా అంటేనే అగ్రరాజ్యంగా పేరుపొందింది. కానీ ట్రంప్ ఈసారి గెలిచిన తర్వాత వారి విధివిధానాల్లో చాలా కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. 50% టారీఫ్ పెంచి భారత్ అంతు చూస్తానని చెప్పకనే చెప్పారు. ఆ తర్వాత భారత్ ప్రధాని మోడీ నాకు మంచి మిత్రుడే అంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. కానీ ఆయన విధివిధానాలే నాకు అస్సలు నచ్చడం లేదని అన్నారు. అయితే తాజాగా మోడీతో మాట్లాడుతున్నాను చర్చలు సఫలం అవుతాయి అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. ఈ విధంగా భారత్ పై ప్రేమ ఉన్నట్టు నటిస్తూనే, యూరప్ దేశాలన్నింటికీ భారతదేశంపై 100% సుంకాలు విధించండి అంటూ వారిని ఎగదోస్తున్నారు.

వారు మన దగ్గర ఆయిల్ కొనకుండా రష్యా నుండి కొంటుందంటూ మనసులో విషాన్ని పెట్టుకొని బయటికి నటిస్తున్నారు. కేవలం భారత్ మీదే కాకుండా చైనా మీద కూడా సుంకాలు వేయండి అంటూ లోలోపల చెప్పుకొస్తున్నారు. ఆయన నోటితో మాట్లాడుతూ నొసలితో వెక్కిరిస్తున్నారని అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ అమెరికా చరిత్రలో ఇంత కన్ఫ్యూజన్ పాలన మాత్రం ఎప్పుడు జరగలేదు. ఈ విధానం ఇలాగే కొనసాగితే మాత్రం భారత్ కు ఏ మాత్రం నష్టం లేదని, నష్టపోయేది అమెరికా నేనని, భారత్ తగ్గేది లేదని మోడీ చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: