ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టిడిపి పార్టీ కార్యకర్తల పట్ల చూపిస్తున్న ప్రేమ చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మాచర్లకు చెందిన టిడిపి కార్యకర్త అయినటువంటి శేషగిరిరావు అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో జరిగిన ఉద్రిక్తతలలో గాయపడ్డారు. ఈ మధ్యనే ఆయన అస్వస్థతో మరణించిన ఘటన పైన నారా లోకేష్ కూడా సంతాపాన్ని తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులు భార్య కృష్ణవేణి, కొడుకు కుమార్తెతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులను ఉండవల్లిలో తన నివాసానికి ఆహ్వానించి మరి ప్రత్యేకించి వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆదరించారు.


ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. టిడిపి కార్యకర్తలు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు లాంటివారే వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా తాను ముందు ఉంటానంటూ హామీ ఇచ్చారు. శేషగిరిరావు త్యాగం టిడిపి పార్టీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ తెలియజేశారు. 2024 ఎన్నికల సమయంలో మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనలో శేషగిరిరావు చాలా ధైర్యంగా పోరాడారు. ఆయన కార్యకర్త కాదు టిడిపి ఆత్మను ప్రతిభావించిన యోధుడు, ఇలాంటి నాయకులే పార్టీకి కావాల్సింది ప్రజాస్వామ్యాన్ని కాపాడతారంటూ నారా లోకేష్ తెలియజేశారు


ఆయన కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తామని విద్య ,ఉపాధి పరంగా కూడా భరోసా ఇస్తామంటూ పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్త వెనుక టిడిపి ఉంటుందంటూ తెలియజేశారు. నారా లోకేష్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టిడిపి కార్యకర్తలలో కూడా మరింత ఉత్సాహాన్ని నింపేలా కనిపిస్తున్నాయి. గతంలో కూడా చాలామంది  కార్యకర్తలతో నేరుగానే మాట్లాడారు. ప్రస్తుతం నారా లోకేష్ కార్యకర్తలతో మమేకం అయ్యేటువంటి చర్యలను చూస్తూ ఉంటే ఆయనను ప్రజల, కార్యకర్తలకు మరింత దగ్గర చేస్తోందని చెప్పవచ్చు. పార్టీ కార్యకర్తలకు పట్ల ఇలాంటి అండదండలు ఉంటాయని మరొకసారి నారా లోకేష్ నిరూపించారు. దీంతో ప్రస్తుతం నారా లోకేష్ ను కార్యకర్తలు దైవంలా  భావిస్తున్నామంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: