ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్‌లు ఒక ఆఫర్స్ కోసం ఓ స్పెషల్  పద్ధతిని అనుసరిస్తున్నారు. వాళ్లు నటించిన సినిమాలు కొంచెం హిట్ అయినా సరే, ఆ క్రేజ్‌, ఆ పాపులారిటీ, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కొనసాగించేందుకు సోషల్ మీడియా వేదికగా రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంటారు. అందులో కొంతమంది బ్యూటీస్ అయితే తమకు తెలియకుండానే ఎక్స్‌పోజింగ్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వివాదాలకు తావు కల్పిస్తున్నారు. ఇప్పుడు అటువంటి పరిణామాల మధ్య వార్తల్లో నిలుస్తున్న పేరు అందాల ముద్దుగుమ్మ శివాని నాగరం. అయితే ఆమె ఓరిజినల్ పేరు కంటే ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టిన పేరు కాత్యాయని. ఎందుకంటే రీసెంట్‌గా వచ్చిన “లిటిల్ హార్ట్స్” సినిమాలో ఆమె పోషించిన పాత్ర పేరు  "కాత్యాయని". ఆ సినిమాలోని “కాత్యాయని భోంచేసావా” అనే పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు — దేశవ్యాప్తంగా ఆ పాట సెన్సేషన్‌గా మారింది.


సినిమా ద్వారా శివాని నాగరం ఒక పెద్ద బ్రేక్ అందుకుంది. ఇప్పటి వరకు ఆమె నటించింది రెండు సినిమాలే. రెండూ హిట్ కావడంతో ఆమెపై ఇప్పుడు భారీ చర్చ నడుస్తోంది. కానీ అదే సమయంలో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా తీవ్రంగా పెరిగింది. కారణం — ఆమె గతంలో షేర్ చేసిన ఫోటోషూట్. ముఖ్యంగా బ్లాక్ కలర్ శారీలో శివాని ఇచ్చిన ఫోజులు, ఆ స్లిమ్ ఫిట్ లుక్‌లో ఆమె చూపించిన నడుము భాగం, అభిమానుల్లో మిక్స్డ్ రియాక్షన్‌కు దారితీసింది.కొంతమంది సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. “ఇలా ప్రైవేట్ పార్ట్‌లను చూపిస్తూ ఫోటోలు షేర్ చేస్తేనే ఆఫర్లు వస్తాయా?”, “ఇది సినిమా గ్లామర్ కాదు, అతి ఎక్స్‌పోజింగ్‌!” అంటూ కొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇంకొందరు మాత్రం “సినిమాలో చాలా బాగుంది, కానీ బయట ఇలాంటి ఫోటోలు ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నారు.



అయితే మరికొందరు అభిమానులు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. “ఇది ఆమె పర్సనల్ ఛాయిస్‌, ఆమె బాడీ, ఆమె స్టైల్‌! ఎవరికీ బాధ కలిగించకపోతే ఇందులో తప్పేంటి?” అంటూ కౌంటర్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.మొత్తానికి లిటిల్ హార్ట్స్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శివాని నాగరం ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆమె ఫోటోషూట్స్ వల్ల ఒకవైపు ఫ్యాన్ బేస్ పెరుగుతుంటే, మరోవైపు విమర్శలు, ట్రోలింగ్ కూడా గట్టిగానే ఎదుర్కొంటోంది. కానీ ఇలాంటి కాంట్రవర్సీలు కూడా స్టార్‌డమ్‌లో భాగమే అని కొందరు అంటున్నారు . ఎందుకంటే నేటి సోషల్ మీడియా యుగంలో పాపులారిటీని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు కదా!



మరింత సమాచారం తెలుసుకోండి: