
అయితే పార్టీలోని మరికొంతమంది నేతలు, ముఖ్యంగా వజ్రనాథ్ అనుచరులు అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అంతర్గత కలహాలు సునీత విజయానికి ఆటంకం కలిగిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బీసీ సామాజికవర్గానికి చెందిన నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. నవీన్ తండ్రి శ్రీశైలం యాదవ్‌కు నియోజకవర్గంలో ఉన్న సానుభూతి, కుటుంబాన్ని నమ్మే ఓటర్లపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. గతంలో ఈ స్థానంలో మూడు సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా, స్థానిక సమస్యలపై ఈసారి ఓటర్లు మారే అవకాశం ఉందన్న ఆశాభావంతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
ఈసారి మళ్లీ ఆయనకే అవకాశం వస్తుందా? లేక కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా అన్నది క్లారిటీ రాలేదు. అయితే తెలంగాణలో తిరిగి పునాదులు వేసుకోవాలని భావిస్తున్న బీజేపీకి జూబ్లీహిల్స్ లో ఓ అవకాశం కనబడుతోంది. ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంక్, టీడీపీతో పొత్తు, కేంద్రం ఇచ్చిన అభివృద్ధి సహాయం వంటి అంశాలు బీజేపీకి బలాన్నిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మైనారిటీ ఓట్లు ఈ ఎన్నికలో కీలకంగా మారనున్నాయి. దాదాపు 1.4 లక్షల ఓటర్లు ముస్లింలే కావడంతో, వీరి ఓట్లు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే బీజేపీ గెలుపు కల నిజం కావడం కష్టమే. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ పక్షాలకు బహుళ సవాళ్లను, అవకాశాలను ఎదురుచూస్తోంది. ఎవరి వ్యూహం ఎంతవరకు పని చేస్తుందో చూడాలి.