
కేంద్ర హోంమంత్రి ,బిజెపి అగ్ర నేత ఆయన అమిత్ షా మాట్లాడుతూ.. బీహార్ NDA కూటమిలో ఎలాంటి మనస్పర్దలు లేవని సోషల్ మీడియాలో జరుగుతున్నది కేవలం దుష్ప్రచారాలు మాత్రమే అంటూ తోసిపుచ్చారు. అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలోనే ఈ బీహార్ ఎన్నికలకు వెళుతున్నామనే విషయాన్ని ప్రస్తావించారు. కానీ బీహార్ NDA ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు మాత్రం అంత తొందర ఎందుకంటు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. దీంతో నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అవుతారా? కార అనే విషయం ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
ఎన్డీఏలో ప్రస్తుతం ఆయన సారాధ్యంలోనే మేము బీహార్ ఎన్నికలకు వెళ్తాము.. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మిత్రపక్షాలన్నీ కలిసి మాట్లాడి అప్పుడు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తామంటూ అమిత్ షా తెలియజేశారు. 2020 ఎన్నికలలో JDU కంటే బిజెపి ఎక్కువ స్థానాలు వచ్చిన ఆ సమయంలో నితీష్ కుమార్ ప్రధాని మోదీని కలిసి బిజెపి పార్టీ నుంచి ఎవరినైనా ముఖ్యమంత్రిగా ఉంచడం సబబని చెప్పగా, కానీ మిత్రపక్షాన్ని తాము ఎప్పుడూ గౌరవిస్తామంటూ నితీష్ కుమార్ సీనియారిటీని పరిగణంలోకి తీసుకొని ఆయన్ని సీఎంగా ఎంచుకున్నామంటూ తెలిపారు అమిత్ షా.
ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మునిపెన్నడూ చూడని భారీ విజయాన్ని చూస్తుందని నవంబర్ 14న వెలుగుబడే ఫలితాలు గత రికార్డులను కూడా బద్దలు కొడతాయంటూ అమిత్ షా తెలియజేశారు. ఇక 74 ఏళ్ల వయసులో నితీష్ కుమార్ ఇప్పటికే 9సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.