ప్రస్తుతం కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో చెప్పనక్కర్లేదు. ప్రతి దాంట్లో వేలు పెడుతూ ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేస్తూ ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొండా సురేఖ గురించి మరొక సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే కొండా సురేఖ కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొండా సురేఖ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అని భయం భయంగా కాంగ్రెస్ అధిష్టానం ఉంది.ఈ నేపథ్యంలోనే కొండా సురేఖని మంత్రి పదవి నుండి తప్పిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ బండారం బయటపడకుండా ఉండాలంటే కొండా సురేఖ ఎన్ని చేసినా సైలెంట్ గా ఉండడం తప్ప చేసేదేమీ లేదు అని కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ కూతురు బిఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండేది.. 

వాళ్లు మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు. కానీ సొంత గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కూడా మాకు ఇబ్బందులు తప్పట్లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేకాదు ఇందులో రేవంత్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి లే మాపై కుట్రలు చేస్తున్నారని కూడా బహిరంగంగానే మీడియా ముందు చెప్పింది.రేవంత్ రెడ్డి మా అమ్మను చాలాసార్లు తిట్టారని,ఆయన అన్న మాటలకు అమ్మ ఇంటికి వచ్చి ఎన్నోసార్లు ఏడ్చింది అంటూ మీడియా ముందు బహిరంగంగా చెప్పింది.అయితే అంత ఓపెన్ గా సురేఖ కూతురు చెప్పింది అంటే కచ్చితంగా ఏదో ట్విస్ట్ ఇవ్వబోతున్నారని కాంగ్రెస్ కి అర్థమైనట్టుంది.

ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తో భేటీ అయి బీఆర్ఎస్ లోకి రావాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి తన కొడుకు పై తనపై ఎన్నో ఆరోపణలు చేసిన కొండా సురేఖకి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారా.. కాంగ్రెస్ లో ఉన్న గొడవలను క్యాష్ చేసుకుంటారా..కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానిస్తారా అనేది తెలియాల్సి ఉంది.అయితే కొంతమందేమో కొండా సురేఖ బీఆర్ఎస్ లోకి వెళ్లడం లేదు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరింది అనే వార్తలన్నీ అవాస్తవమంటూ కొట్టిపారేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది కొండా సురేఖ నోరు విప్పితే గాని తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: