మెగాస్టార్ చిరంజీవి నటించే ఏ సినిమా నుండి అయినా టీజర్, ట్రైలర్ లేదా సాంగ్ రిలీజ్ అయినా, అది సోషల్ మీడియాలో ఎలా హంగామా సృష్టిస్తుందో అందరికీ బాగా తెలుసు. చిరంజీవి పేరు విన్నా సరే అభిమానుల్లో ఉత్సాహం మితిమీరిపోతుంది. అటువంటి స్థాయిలో ఆయన కొత్త సినిమా “మన శంకర వరప్రసాద్” పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్, టీజర్ ద్వారా సినిమాపై క్రేజ్ పెరిగిపోగా, తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” సాంగ్ సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తోంది. సాంగ్ రిలీజ్ అయిన క్షణాలకే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దాటేసింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పాటపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ కూడా మొదలైంది. కొందరు నెటిజన్లు చిరంజీవి యాక్టింగ్‌ స్టైల్‌పై కామెంట్లు చేయగా, మరికొందరు నయనతార డ్యాన్స్‌ స్టెప్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. “అనిల్ రావిపూడి మాస్, కామెడీ మిక్స్‌లో  టచ్ తీసుకున్నాడు” అంటూ పలు వ్యంగ్య కామెంట్లు వెల్లువెత్తాయి.

అయితే, మెగాస్టార్ అభిమానులు మాత్రం దానికి తగిన కౌంటర్ ఇచ్చారు. “ఇది చిరంజీవి స్టైల్‌ — మాస్‌తో మసాలా కలయిక!” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఫుల్ ఫోర్స్‌తో రిప్లైలు ఇస్తున్నారు. ఫలితంగా “మీసాల పిల్ల” పాట సోషల్ మీడియాలో మాత్రమే కాదు, యూట్యూబ్ ట్రెండింగ్స్‌లో కూడా ఇండియాలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఈ పాటను హమ్ చేస్తూ వీడియోలు చేసేస్తున్నారు. రీల్స్, షార్ట్ వీడియోస్, ఫ్యాన్ ఎడిట్స్ — ఏ ప్లాట్‌ఫామ్‌లో చూసినా “మీసాల పిల్ల” మాత్రమే కనిపిస్తోంది. ఈ పాట ప్రస్తుతం పలు బాలీవుడ్ సాంగ్స్‌ను దాటేస్తూ దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ సాంగ్‌గా రికార్డు సృష్టించింది.

ఇంతటి ఘనత యంగ్ హీరోలు కూడా సాధించలేని స్థాయిలో ఉండడం విశేషం. ఈ రికార్డులు చూసి ఇతర హీరోల కుల్లుకోవాల్సిందే అంటున్నారు జనాలు.  మెగా ఫ్యాన్స్ మాత్రం “ఇదే మెగాస్టార్ రేంజ్” అంటూ సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం భీమ్‌స్ అందిస్తుండగా, ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు సాహు గారపాటి తీసుకున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మొదటి పాటతోనే దుమ్ము రేపిన “మన శంకర వరప్రసాద్” సినిమా, టీజర్ మరియు ట్రైలర్ రాగానే ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం — మెగాస్టార్ మంత్రం ఇప్పటికీ అదే స్థాయిలో పని చేస్తోంది!


మరింత సమాచారం తెలుసుకోండి: