
అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చోటుచేసుకున్న ఒక ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ప్రదీప్ రంగనాథన్ ఒక ఈవెంట్‌లో సరదాగా హీరోయిన్ మమితా బైజు బుగ్గను గిల్లాడు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయి, సోషల్ మీడియాలో దుమారం రేపింది. కొంతమంది అభిమానులు దాన్ని క్యూట్‌గా తీసుకుంటే, మరికొందరు మాత్రం అతని ప్రవర్తనను విమర్శిస్తూ మండిపడుతున్నారు.“సినిమా ప్రమోషన్స్ అంటే ఇలా హీరోయిన్లను టచ్ చేస్తూ, బుగ్గలు గిల్లుతూ చేస్తేనేనా సినిమా హిట్ అవుతుంది?” అంటూ చాలామంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే, “ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ అవసరమా? సినిమా ప్రమోషన్స్‌కి ఇది సరైన మార్గమా?” అని ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా, సినిమాలోనూ ప్రదీప్, మమితా మధ్య ఉన్న ఒక సీన్ ఉంటుందట. సినిమాలో హీరోయిన్ హీరో బుగ్గలు గిల్లి నవ్వుకుంటుంది. ఆ సీన్ ఇప్పుడు మళ్లీ చేశారు. కానీ ఈసారి రోల్స్ రివరస్. హీరో - హీరోయిన్ బుగ్గ గిల్లుతాడు. ఫన్నీగా, క్యూట్‌గా ఉన్నప్పటికీ, రియల్ లైఫ్ ప్రమోషన్స్‌లో అదే హావభావాలు చూపడం కొంతమందికి నచ్చలేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ప్రదీప్ రంగనాథన్‌కి ఇది కొత్త వివాదం కాదు. గతంలో కూడా ఆయన తన సినిమాల ప్రమోషన్స్ సమయంలో ఓవర్ ఎక్స్‌ప్రెషన్, అసహజమైన హావభావాలతో కొంతమందికి అసౌకర్యం కలిగించాడనే కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు మమితా బైజుతో జరిగిన ఈ సంఘటన మరోసారి అతని పేరును సోషల్ మీడియాలో ట్రెండ్‌లోకి తెచ్చింది. సినీ విమర్శకులు చెబుతున్నట్లుగా — “ప్రమోషన్స్ అనేది సినిమా మీద ఆసక్తి పెంచే వేదిక, వివాదాలు రేపే వేదిక కాదు. ప్రేక్షకులు ఇప్పుడు చాలా అవగాహన కలిగినవారు. నటులు తమ ప్రవర్తనలో మరింత జాగ్రత్తగా ఉండాలి.” అంటున్నారు. మొత్తం మీద, ‘డ్యూడ్’ సినిమా రిలీజ్‌కి ముందే హీరో ప్రదీప్ రంగనాథన్ చుట్టూ ఈ వివాదం చెలరేగడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడుతుందో చూడాలి కానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ సంఘటన ప్రదీప్‌కి పెద్ద తలనొప్పిగా మారింది.