- స్వర్ణ కుప్పం - స్వచ్ఛ కుప్పం లక్ష్యాలను సాధన దిశగా KADA అడుగులు

కుప్పం నియోజకవర్గం మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. పర్యావరణహిత అభివృద్ధిలో ముందడుగు వేస్తూ, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ఆధ్వర్యంలో కేవలం 24 గంటల్లో 5 వేలకుపైగా ఈ - సైకిళ్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ అరుదైన ఘనతతో కుప్పం నియోజకవర్గం ‘నెట్ జీరో’ లక్ష్యాల దిశగా మరో కీలక మైలురాయిని అధిగమించి, దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీకారం చుట్టారు. ఆయన తన నివాసం నుంచి తుమ్మిసి గ్రామంలోని ప్రజావేదిక వరకు ఈ-సైకిల్ తొక్కుతూ వెళ్లడం ద్వారా , ఈ-మొబిలిటీ ప్రాధాన్యతను ప్రజలకు మాటల కన్నా కార్యాచరణ ద్వారా స్పష్టంగా చాటిచెప్పారు. ఇది కేవలం ఒక ప్రారంభం కాకుండా , భవిష్యత్ తరాల కోసం స్థిరమైన అభివృద్ధి దిశగా తీసుకున్న స్పష్టమైన సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.


ముఖ్యమంత్రి విజన్ ‘ స్వర్ణ కుప్పం ’ ను కార్యరూపం దాల్చే దిశగా, కడా డైరెక్టర్ వికాస్ మార్మట్ , ఐఏఎస్ , సమర్థవంతమైన ప్రణాళికలు, వేగవంతమైన అమలుతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ-సైకిల్ కార్యక్రమం సామాజిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో స్పష్టమైన మార్పును తీసుకొస్తోంది. ఈ - సైకిళ్ల వినియోగం ద్వారా పెట్రోల్, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గడంతో ప్రతి కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలకు పైగా ఆదా జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ పరంగా ఈ కార్యక్రమం కీలకమైన మార్పును తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని ‘ నెట్ జీరో నియోజకవర్గం ’గా తీర్చిదిద్దడమే కాకుండా , ‘ స్వర్ణ కుప్పం – స్వచ్ఛ కుప్పం ’ లక్ష్యాలను సాధించే దిశగా KADA స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: