సినిమా షూటింగ్ ఎప్పుడు? అప్‌డేట్ ఎప్పుడు? అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ నుంచి ప్రస్తుతానికి నిశ్శబ్దమే సమాధానంగా వస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ‘కల్కి 2’ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది. దీనికి ప్రధాన కారణం మొదటి భాగం క్లైమాక్స్‌లో నాగ్ అశ్విన్ వదిలిన ఆ భారీ క్యూరియాసిటీ. కమల్ హాసన్ ‘యాస్కిన్’ పాత్ర పవర్ ఏంటి? భైరవ (కర్ణుడు) ప్రయాణం ఎటు సాగబోతోంది? అన్న ప్రశ్నలు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ తన లైనప్‌లో ఉన్న ఇతర భారీ ప్రాజెక్ట్స్—సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, హను రాఘవపూడి ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూడకుండా నాగ్ అశ్విన్ ఒక తెలివైన ప్లాన్ వేశారు.అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ పాత్రలకు సంబంధించిన ఇంటెన్స్ సీన్లను ప్రభాస్ అందుబాటులోకి వచ్చేలోపు పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. సీక్వెల్‌లో ఈ ఇద్దరు దిగ్గజ నటుల పాత్రల నిడివి మరింత ఎక్కువగా ఉంటుందని, వీరి మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 2027లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇది ఎంతవరకు సాధ్యమనే సందేహాలు కూడా ఉన్నాయి.కల్కి కేవలం కమర్షియల్ సినిమా కాదు. ఇందులో వర్చువల్ వరల్డ్ డిజైనింగ్, భారీ సీజీఐ వర్క్ ఉంటుంది. మొదటి భాగం కంటే రెండవ భాగంలో యాక్షన్ స్కేల్ రెట్టింపు ఉంటుందని టాక్.షూటింగ్ పూర్తయిన తర్వాత కనీసం 8 నెలల సమయం కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే అవసరమవుతుంది. క్వాలిటీ విషయంలో నాగ్ అశ్విన్ అస్సలు రాజీ పడరని మనకు తెలిసిందే.
కెజిఎఫ్, పుష్ప తరహాలో భారతీయ సినిమాల్లో ఫ్రాంచైజ్ కల్చర్‌ను ‘కల్కి’ మరో స్థాయికి తీసుకెళ్లబోతోంది. భవిష్యత్తులో ఈ కల్కి యూనివర్స్ నుంచి మరిన్ని స్పిన్ ఆఫ్స్ (ఇతర పాత్రల నేపథ్యంతో సినిమాలు) వచ్చే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి