నాగార్జున  కెరీర్‌లో 100వ సినిమా అంటే అభిమానులకు ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పనిలేదు. ఒక హీరో ప్రయాణంలో శతవ చిత్రం అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు, అతని సినీ ప్రస్థానానికి ప్రతీకగా నిలిచే మైలురాయి. అందుకే నాగార్జున అభిమానులు ఈ సినిమాపై అసాధారణ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా సరైన మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో, ఈ చిత్రం ఖచ్చితంగా భారీ కం బ్యాక్ ఇస్తుందనే నమ్మకం రోజురోజుకీ మరింత బలపడుతోంది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి అధికారికంగా ఎలాంటి కంటెంట్ విడుదల కాలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంకా బయటకు రాలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో లీకైన ఒక చిన్న మేకింగ్ వీడియో మాత్రం అభిమానుల్లో భారీ చర్చకు దారితీసింది. సాధారణంగా లీక్ వీడియోలు కొద్ది గంటల్లో మాయం అవుతాయి. కానీ ఈ సన్నివేశానికి సంబంధించిన షాట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారి, సినిమా గురించి కొత్త అంచనాలను పెంచేసింది.

ఆ లీకైన వీడియోలో టబు పై కొందరు దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా, నాగార్జున ఎంతో ఆగ్రహంతో కానీ, అదే సమయంలో ఆమెను రక్షించే విధంగా కారు నుండి జాగ్రత్తగా బయటకు దింపి లోపలికి తీసుకెళ్తున్న సన్నివేశం కనిపిస్తోంది. ఆ ఒక్క షాట్‌లోనే భావోద్వేగం, టెన్షన్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కనిపించాయి. ముఖ్యంగా నాగార్జున చూపించిన బాడీ లాంగ్వేజ్, ఆయన నడక, ముఖంలో కనిపించిన సీరియస్ ఇంటెన్సిటీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కేవలం యాక్షన్ కోసం తీసిన కమర్షియల్ మూవీ కాదని, బలమైన ఎమోషన్స్‌తో కూడిన ఇంటెన్స్ డ్రామాగా ఉండబోతుందనే భావన ఆ వీడియో చూసిన వారికి కలుగుతోంది.

ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాలో నాగార్జున లుక్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఇటీవల కూలీ చిత్రంలో ఆయన ఎలా కనిపించారో, దాదాపు అదే తరహా స్టైలింగ్ ఇందులో కూడా కనిపించిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గడ్డం, హెయిర్ స్టైల్, కళ్లలో కనిపించిన ఆ ఇంటెన్స్ లుక్ — ఇవన్నీ కలిపి నాగార్జునను మళ్లీ ఒక పవర్‌ఫుల్ మాస్ అవతార్‌లో చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యువ ప్రేక్షకులు కూడా ఈ లుక్‌కు మంచి స్పందన ఇస్తున్నారు.

మాకు సంబంధించి మరో వార్త కూడా చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ చిత్రంలో ఒక బడా సూపర్ స్టార్ క్యామియో రోల్‌లో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కోసం చిరంజీవి  పేరు బలంగా వినిపిస్తోంది. నాగార్జునచిరంజీవి ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు అది నిజంగా పండుగలాంటి విషయం అవుతుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది నిజమేనా, లేక కేవలం రూమర్ మాత్రమేనా అన్నది తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.


 

మరింత సమాచారం తెలుసుకోండి: