ఇప్పటికే ఈ విషయం పైన గత ఏడాది నవంబర్ 28న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ఆదేశాలను కూడా జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసుకోవడానికి 90 రోజులపాటు మెసేజింగ్ ప్లాట్ ఫామ్ లకు గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 28 తో పూర్తి అయ్యింది. దీంతో కొత్త నిబంధనలు ఆదివారం నుంచే ప్రారంభమవుతాయి. ఈ నిబంధనల ప్రకారం సిమ్ లేకుండా మొబైల్లో వాట్సప్ , మెసేజింగ్ యాప్స్ వంటివి ఉపయోగించలేరు. ఒకవేళ వాడుతున్న ఆ సేవలు నిలిచిపోతాయి.
మొబైల్ నుంచి సిమ్ తీసేసిన, స్వైపింగ్ చేసిన, డిఆక్టివేషన్ చేసిన కూడా ఈ యాప్స్ ఆగిపోతాయట. మళ్లీ ఒరిజినల్ సిమ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే మళ్ళీ అవి యాక్టివేషన్ అవుతాయని చెబుతున్నారు. ఇక కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్, టెలిగ్రామ్ వంటివి కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతాయని, మళ్లీ తిరిగి యాక్టివేషన్ అవ్వాలి అంటే మొబైల్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే యాక్టివేషన్ అవుతుందట. సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ఉండేందుకు, డిజిటల్ భద్రతకు ఉపయోగపడేలా ఈ నిబంధనను తీసుకువచ్చారని సమాచార శాఖ మంత్రి జ్యోతి రాదిత్య సింధియా తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి