ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవర పెడుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో మాత్రం సామాన్యుడి జేబుకు సైతం మరోసారి చిల్లుపడే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమూరు ధరలు అధికమవడంతో దేశీయంగా పెట్రోల్ ,డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయి. సుమారుగా రూ .25 నుంచి రూ .28 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందంటూ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్స్టిట్యూషన్ తాజా నివేదికలు తెలియజేసింది



పచ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వాళ్ళ ముడి చమురు సరఫరా ఆటంకం ఏర్పడడంతో పాటుగా హర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాలలో రవాణా ఆగిపోవడం ఈ సంక్షోమానికి ప్రధాన కారణం అన్నట్లుగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వం చమురు ధరలను పెంచకుండా నియంత్రిస్తున్నప్పటికీ ఇప్పుడు పెరుగుతున్న రిఫైనరీ నష్టాల వల్ల ఈ పెంపు అనివార్యం అన్నట్లుగా పలువురు విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చెంబులు ధర భారీగా పెరిగిన ఇండియాలో చమురు విక్ర సంస్థలు ఇప్పటివరకు ఆ భారాన్ని వినియోగదారుల పైన  మోపలేదు.


దీనివల్ల పెట్రోల్ పైన లీటరుకు రూ.18 రూపాయలు, డీజిల్ పై రూ .35 రూపాయల వరకు నష్టం వస్తోందని దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అవ్వగానే ఏప్రిల్ 29 తర్వాత ఇంధన ధరలు సవరించే అవకాశాలు ఉంటాయని కొటక్ ఈక్విటీస్ అంచనా వేస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ధరలు పెంచకుండా స్థిరంగా ఉండేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ముడి చెమురులు పెరగడం వల్ల భారత దిగుమతి చేసుకొని చమురు బిల్లు రోజుకి 190 నుంచి 210 మిలియన్ల మేర అదనంగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ద్రవయోల్బణం పైన కూడా చాలా తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.77 పైసలు ఉండగా ముంబైలో రూ.103 వద్ద ఉన్నది. ఒకవేళ కొటక్ ఈక్విటీ అంచనాలు నిజమైతే మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ,అలాగే నిత్యవసర వస్తువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: