ఆంధ్రప్రదేశ్లో ఏప్పుడెప్పుడ అని కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం తాజాగా శుభవార్త అందించింది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ నుంచి అవకాశం కల్పించబోతోంది. ఆ నెల నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయబోతున్నారు. ముందుగా వితంతులు, దివ్యాంగులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతోంది. దీంతో అదే రోజున వితంతు పింఛన్లను విడుదల చేయబోతున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.53 లక్షల మంది వితంతు పింఛన్ కోసం అర్హత సాధించినట్లుగా ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం గుర్తించింది. దీంతో వీళ్ళకి పింఛన్ అందించాలి అంటే ప్రతి నెల రూ .61 కోట్ల రూపాయలు అదనంగా అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముందుగా వితంతువులకు పింఛన్ మంజూరు చేయగా,ఆ తర్వాత దివ్యాంగులకు కోటాలో పింఛన్ మంజూరు చేయడానికి లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారని , అలా మొత్తం మీద 28 క్యాటగిరిలలో ప్రభుత్వం వీరికి పింఛన్ మంజూరు చేయనుంది. దీంతో దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నదట.



దీంతో సుమారుగా ప్రతి ఏడాది రూ.4,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఈ విషయాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం కొత్త పింఛన్లను జారీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సదరం సర్టిఫికెట్ జారిని డిజిటల్ విధానంలో ఏపీ ప్రభుత్వం జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే స్లాట్ బుకింగ్ సర్టిఫికెట్లు జారిని ఆన్లైన్ ద్వారానే జారీ చేస్తోంది. ఇక నుంచి కూడా ఆన్లైన్ ద్వారానే ఈ ఫ్లాట్ బుకింగ్ చేసుకునేలా సదుపాయం కల్పిస్తోంది. అనంతరం వైద్య పరీక్షల కోసం ఒక సమయాన్ని కేటాయిస్తారు. అక్కడ వైద్యులు పరీక్ష చేయవలసి ఉంటుంది అనంతరం ఆన్లైన్ లోనే ఆ సదరం సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: