ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళలు గత కొంతకాలంగా అభయ హస్తం పథకం కింద కొంత సొమ్ముని జమ చేస్తున్నారు. అయితే తాను దాచుకున్న సొమ్మును తిరిగి ఇస్తారో.. ఇవ్వరో అని ఆందోళనలో చాలామంది మహిళలు ఉన్నారు. అయితే వారందరికీ ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నిధులను వెనక్కి ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల కోసం అభయ హస్తం అనే పథకం తీసుకువచ్చింది అప్పటి ప్రభుత్వం. ఇది సామాజిక భద్రత పథకం. దీని ప్రకారం మహిళలు రోజుకు ఒక్క రూపాయి చొప్పున ఏడాదికి రూ .365 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే చాలు, ప్రభుత్వం తన వాటాగా మరో రూ .365 రూపాయలు జమ చేసి ఇస్తుంది. ఇలా 60 ఏళ్లు నిండిన డాక్రా గ్రూపులో ఉన్న మహిళలకు నెలకు రూ .500 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 22 లక్షల మంది మహిళలు గత 12 ఏళ్లుగా ఈ పథకంలో కొనసాగుతూనే ఉన్నారు. దీంతో సుమారుగా రూ.1,194 కోట్ల రూపాయల వరకు పొదుపు అయినట్టుగా తెలుస్తోంది.


నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాటా కూడా రూ .1000 కోట్ల రూపాయలు కలిపితే ఈ నిధి మొత్తం సుమారుగా రూ.2,194 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే గత ప్రభుత్వం ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్ళించారని , కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ మేరకుగాను మహిళల సొమ్ము వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యిందని తెలియజేస్తోంది. మహిళల వ్యక్తిగత ఖాతాలో ఈ డబ్బు జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందని అలా 22 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా వెలుసుబాటు కల్పించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పోలిస్తే అభయ హస్తం పెన్షన్ చాలా తక్కువగా ఉండడంతో చాలామంది మహిళలు ఆ డబ్బును వెనక్కి తీసుకోవాలని మక్కువ చూపారు. అందుకే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిధులను విడుదల చేయడానికి పెద్దపీట వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: