తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అపర చాణక్యుడు అని పేరు. అందుకు తగ్గట్టే ప్రతికూల పరిస్థితుల్లో లో తన సుసంపన్నమైన నా మేథాశక్తిని ఉపయోగించి అప్పటికప్పుడు కొత్త అస్త్రాలను వదులుతుంటారు. అందులో ఒక భాగమే సినీ నటుడు శివాజీ డేటా చోరీపై చేసిన ప్రెస్ మీట్. 
హుటాహుటిన గా జరిపిన ఈ ప్రెస్ మీట్ ను చూసి అందరూ విషయం తెలుగు దేశం పార్టీ చేయి దాటిపోయిందని అనుకుంటున్నారు. ఇక ప్రెస్ మీట్ విషయానికి వస్తే శివాజీ యావత్ ఆంధ్ర రాష్ట్రం లోని ప్రజలందరూ తెలివి తక్కువ వారు అన్నట్లుగా మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ పై అభియోగం చేయబడ్డ డేటా చోరీ కేసుకు సంబంధించి వారిని అమాయకులకు చిత్రించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఏవో డాక్యుమెంట్లు పట్టుకొచ్చి ఇవి ఎన్నికల కమిషన్ నుండి అతను సంపాదించినట్లు, 2015 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ డేటా చోరీ పాల్పడినట్లు చెప్పారు. ఏదో సర్వే ను ఉపయోగించుకొని, ఎలక్షన్ కమిషన్ నుండి మరింత డేటాను సంపాదించి వాళ్లకు వ్యతిరేక ఓటర్ల లిస్టు తొలగించినట్లుగా వ్యాఖ్యానించారు.
ఇలా తీవ్ర స్థాయిలో టీడీపీ కి శివాజీ వత్తాసు పలకడం అందరికీ కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఒక పక్క టీడీపీ పైన ఓటర్ల లిస్టు తొలగించారు అని కేసు బనాయిస్తే అంటాను మాత్రం ఎప్పుడో తెలంగాణ లో ఇలా జరిగింది, ఆంధ్రులు వెర్రి వాళ్ళుగా వ్యవహరిస్తూ ఇదేదో వింత అన్నట్లు తెలుగు దేశం పార్టీని ఆడిపోసుకుంతున్నారు అని అనడం ఏమాత్రం సమంజసం కాదు అని చర్చ. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అటువంటి చర్యలకు పాల్పడితే కోర్టులో కేసు నమోదు చేసి అతని దగ్గర ఉన్న కచ్చితమైన ఆధారాలతో శిక్ష వేయించాల్సింది పోయి ఇప్పుడున్న విషయాన్ని పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తుండడం ఇప్పుడు అందరి నుండి అనేక విమర్శలకు దారినిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: