ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాలన ప్రారంభమైందని   వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలలో జలకళే ఇందుకు నిదర్శనమన్నారు. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. ప్రధానంగా జిల్లాలో అన్ని జలాశయాలు జలకళతో ఉన్నాయన్నారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గములో చారిత్రాత్మక ఘట్టాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్ ఆవిష్కరించనున్నారు. నవరత్నాలలో ఒక పధకం వై.యస్.ఆర్. రైతుభరోసాని అన్నారు. ఆ పధకాన్నితమ జిల్లాలో ప్రారంభించడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. పాదయాత్రలో సీఎం జగన్  ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని కాకాని తెలిపారు.


ముఖ్యమంత్రి జగన్ పాలనలో  రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కానీ ప్రతిపక్ష నాయుడు, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఒక్కరే బాధపడుతున్నారని గోవర్ధన రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో  ఏ వర్గం వాళ్ళు కూడా నమ్మరని జ్యోశం చెప్పారు.ఏ పరిస్థితిని జీర్ణించుకోలేని చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. రుణమాఫీ అని చంద్రబాబు గతంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. కానీ తమ నాయకుడు,  ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి  చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని చెప్పటానికి చాలా గర్వంగా ఉందన్నారు.




కానీ చంద్రబాబుకు అవి నచ్చక కావాలని వైయస్సార్సీపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆయన  ఉనికిని కాపాడుకునేందుకు జిల్లాలో రెండు రోజుల పర్యటన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అయినా చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.  రానున్న రోజులలో తెలుగుదేశంకు టికెట్ అడిగే వారు కూడా ఉండరని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే తమ పార్టీలోని కొందరిని బి.జె.పి.లోకి పంపుతున్నారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్సు గల్లంతు అవుతుందని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: