నేటి మంచిమాట.. సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది! అవును.. మీరు అనుకోవాలి కానీ పైనున్న చంద్రున్ని అయితే తీసుకురాలేరు కానీ అంతటి పనిని భూమిపై చెయ్యగలరు. అంతటి శక్తి వస్తుంది ఈ ఒక్క పాజిటివ్ మాటలో. ఎంతటి పనైనా సరే ఈజీగా చెయ్యగలరు.. అదే సాధ్యం కాదు అనుకుంటే చెయ్యగలిగే పని కూడా మీరు చెయ్యలేరు. 

 

అందుకే ఎంత కష్టమైన పని అయినా సరే.. సులభం.. చాలా ఈజీ అని అనుకుంటే మంచి జీవితాన్ని పొందుతారు. మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు నచ్చిన జీవితాన్ని పొందుతారు. అవును కదా! ఇంత మంచిగా బ్రతకడానికి ఒక్కటే రీజన్.. ఏ పని అయినా మనం చెయ్యగాలం.. సాధించగలం అని అనుకుంటారు. అందుకే జీవితం బాగుంటుంది. 

 

మరి కొందరు ఉంటారు.. చెయ్యగలిగే పని కూడా చెయ్యలేరు.. కాస్త పాజిటివ్ మైండ్ ఉండదు. ఎంతమంది చెప్పిన.. ఎన్ని అవకాశాలు ఇచ్చిన సాధించగలం అనే నమ్మకం వారిలో ఉండదు. అందుకే ఈ సమస్యలు. ఇంకా అలా కాకుండా ఏమైనా సాధించగలం అని అనుకునేవారు.. కేసీఆర్ లా తెలంగాణను సొంతం చేసుకుంటారు.. రాష్ట్రాన్ని ఏలుతారు.. సీఎం జగన లా సాధ్యం అవుతుంది అని పార్టీని స్థాపించి పదేళ్లు పోరాటం చేశారు.. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఏది అయినా.. అది ఎంత కష్టం అయినా మనకు సాధ్యం అవుతుంది అని అనుకుంటే మనకు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. 

 

అలా కాదు అని.. ఇది అవ్వదు.. ఇది కొంచం కష్టమైన పని.. మనం చెయ్యలేం.. మనకు ఒకరు సహాయం చెయ్యాలి అని అనుకుంటే మనం ఏది చెయ్యలేం. ఏది సాధించలేం.. అందుకే మనం పాజిటివ్ మైండ్ తో ఉండాలి.. అప్పుడే ఏమైనా సాధించగలం.. సాధించి జీవితాంతం ఆనందంగా ఉండగలం.       

మరింత సమాచారం తెలుసుకోండి: