ఇండియన్ బౌలర్ షమీ.. విజయం ముంగిట ఆఫ్గన్ల కొంప కొల్లేరు చేసేశాడు. చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సిన వేళ.. తొలి బంతి ఫోర్ కొట్టి ఊపు మీద ఉన్న ఆఫ్లన్ బ్యాట్స్ మెన్ ఆశలు వరుస బంతులతో గల్లంతు చేసేశాడు. మూడు వరుస బంతుల్లో ముగ్గురిని పెవిలియన్ కు పంపి భారత్ విజయం ఖాయం చేశాడు. 


ఈ హ్యాట్రిక్ తో షమీ రికార్డులకు ఎక్కాడు. అవేంటో చూద్దాం.. వన్డేల్లో హ్యాట్రిక్‍ నమోదు చేసిన నాలుగో భారత బౌలర్‍ మహ్మద్‍ షమీ రికార్డు పుటలకెక్కాడు. గతంలో భారత్‍ తరఫున చేతన్‍ శర్మ, కపిల్‍ దేవ్‍, కుల్‍దీప్‍ యాదవ్‍ హ్యాట్రిక్‍ సాధించారు.

 ప్రపంచకప్‍లో హ్యాట్రిక్‍ నమోదు చేసిన రెండో భారత బౌలర్‍గా మహ్మద్‍ షమీ రికార్డ్ సృష్టించాడు. 1987లో న్యూజీలాండ్‍పై భారత్ బౌలర్ చేతన్ శర్మ హ్యాట్రిక్‍ సాధించాడు. వరల్డ్ కప్ లో అప్పటివరకూ అదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. 

మళ్లీ  32 ఏళ్ళ తర్వాత ప్రపంచకప్‍లో భారత్‍ తరఫున షమీ హ్యాట్రిక్ సాధించాడు. శనివారం షమీ సాధించిన హ్యాట్రిక్ తో ప్రపంచ కప్ లో ఇప్పటివరకూ మొత్తం 10  హ్యాట్రిక్‍ లు నమోదయ్యాయి. ఇదీ షమీ హ్యాట్రిక్ రికార్డుల కథాకమామీషు..


మరింత సమాచారం తెలుసుకోండి: