వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు పసికూన జట్లు మంచి ప్రదర్శన చేస్తూ పాయింట్లు పట్టికలో పైపైకి వెళుతూ ఉంటే మరోవైపు అప్పటికే వరల్డ్ కప్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న జట్లు మాత్రం పెద్దగా తమ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఎవరికి క్లారిటీ లేకుండా పోతుంది అని చెప్పాలి. ఏ ఒక్క మ్యాచ్ మిస్ చేయకుండా ప్రేక్షకులందరూ ప్రతి మ్యాచ్ కూడా ఫాలో అవుతూనే ఉన్నారు.



 ఇకపోతే నేడు మరో ఆసక్తికర పోరు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పాలి. ఇప్పటికే దాదాపు అటు సెమిస్ అవకాశాలు కనుమరుగు  అయ్యే పరిస్థితి ఉంది. దీంతో ఇక ఆస్ట్రేలియా ప్రతి మ్యాచ్లో విజయం సాధించడమే కాదు భారీ తేడాతో సక్సెస్ సాధించి ఇక రన్ రేట్ కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి.


 అదే సమయంలో మరో దిగ్గజ జట్టు అయిన ఇంగ్లాండు మీద ఇటీవలే ఐర్లాండ్ విజయకేతనం ఎగరవేసి క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఇంగ్లాండ్పై విజయంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక గ్రూప్ ఏ లో భాగంగా ఐర్లాండ్ మూడవ స్థానంలో ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక నేడు ఆస్ట్రేలియా ఐర్లాండ్ మధ్య జరగబోయే మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరగబోతుంది అన్నది మాత్రం అర్థమవుతుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే క్వాలిఫైయర్ మ్యాచ్లలో వెస్టిండీస్ ను సూపర్ 12 మ్యాచ్లో ఇంగ్లాండ్ ను ఓడించిన ఐర్లాండ్ను  తక్కువ వేస్తే మాత్రం ఇక అటు ఆస్ట్రేలియా కు వంగపాటు తప్పదు అన్నది విశ్లేషకులు అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: