
405 మంది ప్లేయర్లు ఈ వేళలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పాలి. ఇందులో 273 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 132 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మొత్తంగా 991 మంది ప్లేయర్లు మినీ వేలం కోసం తమ పేరును దరఖాస్తు చేసుకోగా.. ఇక ఫ్రాంచైజీలు వారి సంఖ్యను 405కు తగ్గించాయి.. 87 స్థానాల కోసం ప్రస్తుతం 405 మంది ప్లేయర్ల మధ్య పోటీ జరగబోతుంది అని చెప్పారు. ఇక ఈ మినీ వేలం ప్రక్రియ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి.
ఇక ప్రేక్షకులు అందరూ ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న ఈ మినీ వేలాన్ని ఇంట్లో కూర్చునే ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం ఉంది. టీవీల్లో చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్ ద్వారా మినీ వేలాన్ని లైవ్ లో చూడడానికి అవకాశం ఉంది.. ఒకవేళ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై ఇక ఈ మినీ వేలం లైవ్ ప్రసారం చూడాలి అనుకుంటే... ఇక జియో సినిమా ఈ మినీ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ క్రమంలోనే జియో సిమ్ యూజర్లు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే జియో సినిమాను డౌన్లోడ్ చేసుకొని మినీ వేలాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. జియో సినిమా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్ ను ఎంటర్ చేసి లాగిన్ అయితే సరిపోతుంది. సబ్ స్క్రిప్షన్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.