ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇక ఎంతోమంది క్రికెటర్లను ప్రోత్సహించే విధంగా ఎప్పటికప్పుడు అవార్డులను రివార్డులను ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక నెల ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రధానం చేయడం ఎన్నో రోజులుగా ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తుంది. అదే సమయంలో ఒక సంవత్సరం మొత్తం మంచి ఫామ్ కనబరిచిన ఆటగాడికి ఇక ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంది అని చెప్పాలి.


 ఇక అదే సమయంలో ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లాంటివి ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఇక ఐసిసి ఇలా ప్రకటించినప్పుడు ఇక ప్రపంచ క్రికెట్లో మేటి ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారి పేర్లు ఇక ఈ టీంలో దర్శనమిస్తూ ఉంటాయి అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇటీవలే 2022 ఏడాదికి సంబంధించి ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఐసీసీ ప్రకటించిన ఈ జట్టు వివరాలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.


 ఇక ఆ వివరాలు చూసుకుంటే టెస్ట్ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్ల 11 మంది లిస్టులో అటు టీమిండియా నుంచి ఒకే ఒక ఆటగాడు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు టీమ్ ఇండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ అని చెప్పాలి. ఇక ఐసిసి ప్రకటించిన ఈ జట్టుకు ఇంగ్లాండు కెప్టెన్ బెన్ స్టోక్స్ ని సారధిగా ఎంపిక చేసింది అని చెప్పాలి. ఇకపోతే రోడ్డు ప్రమాదం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక అతను కొన్ని నెలలపాటు క్రికెట్కు దూరంగా ఉండబోతున్నాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక రిషబ్ పంత్ ను  ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆప్ ది ఇయర్ జట్టులో చోటు దక్కడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc