
2022 ఏడాదిలో టి20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా కూడా సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డును సురక్షించాడు అని చెప్పాలి. అంతేకాదు టి20 ఫార్మాట్లో ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇలాంటి అద్భుతమైన ఫామ్ ను కొనసాగించిన సూర్య కుమార్ యాదవ్‌ను ఏకంగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో నామినేట్ చేసింది. దీంతో అతనికి అవార్డు దక్కుతుందని అందరు అనుకున్నారు.
అనుకున్నట్లుగానే ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అతనికే కట్టబెట్టింది అని చెప్పాలి. దీంతో అభిమానులు అందరూ ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇక ఇలాంటి అరుదైన అవార్డు రావడం పై టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు. మీ అందరి దీవెనల వల్లే అవార్డు వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేని విధంగా ఉంది అంటూ తెలిపాడు. ఇక ఈ ప్రయాణంలో సహాయపడిన ఫ్రెండ్స్, కోచ్, ఫ్యామిలీ, జట్టు సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ తెలిపాడు సూర్య కుమార్. ఇక తాను చేసిన తొలి సెంచరీ ఎప్పటికీ మరుపు రానిది అంటూ చెప్పుకొచ్చాడు.