
ఈ క్రమంలోనే టీమిండియా అద్భుతంగా రానించడం ఖాయం అని అందరూ భావించారు. కానీ ఊహించిన రీతిలో చివరికి టీమ్ ఇండియాకు మొదటి మ్యాచ్ లోనే పరాభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. అయితే మొన్న వన్డే సిరీస్ గెలిచినప్పుడు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసిన అభిమానులు ఇక ఇప్పుడు టి20 మ్యాచ్ ఓడిపోవడంతో మరోసారి టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన పై తిట్ల వర్షం కురిపిస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే చెత్త బౌలింగ్‌తో అర్షదీప్ సింగ్ విమర్శలు మూటగట్టుకోగా ఇకరాహుల్ త్రిపాఠినీ సైతం వదలకుండా ట్రోల్స్ చేస్తున్నారు నేటిజన్లు.
ఓపనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ ఔట్ అయినా తర్వాత క్రీజులోకి వచ్చాడు రాహుల్ త్రిపాఠి. అంటే విరాట్ కోహ్లీ స్థానంలో వచ్చాడు. అయితే ఎక్కడ తన బ్యాటుతో ప్రభావం చూపలేకపోయాడు. ఏకంగా ఆరు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేదు. అంతేకాదు నిర్లక్ష్యమైన షాట్ ఆడి చివరికి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇలా డకౌట్ అయ్యాడు అని చెప్పాలి. ఇలా కోహ్లీ స్థానంలో వచ్చి కోహ్లీ స్టయిల్ లో బ్యాటింగ్ చేసి కష్టాల్లో ఉన్న టీం ఇండియాను గట్టేక్కించాల్సింది పోయి.. ఇక బాధ్యతను పక్కనపెట్టి చెత్త బ్యాటింగ్ చేయడం ఏంటి అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ స్థానాన్ని అప్పగిస్తే ఇలాగైనా బ్యాటింగ్ చేసేది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి.