పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఖుర్రుమ్ మంజూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం  గా మారి పోయాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.  ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్ల లో మొదటి వరుస లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీని తక్కువ చేస్తూ మాట్లాడాడు ఈ పాకిస్తాన్ ఆటగాడు. విరాట్ కోహ్లీ కాదు తానే ఫార్మాట్లో నెంబర్ వన్  వన్ అంటూ చెప్పుకొచ్చాడు. తన సగటు విరాట్ కోహ్లీతో పోల్చి చూస్తే మరింత మెరుగ్గా ఉందని.. అందుకే నేనే నెంబర్ వన్ ఆటగాడిని ఇక నా తర్వాతే విరాట్ కోహ్లీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి.


 ఈ క్రమంnలోనే విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ వెటరన్ ప్లేయర్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనం గా మారి పోయాయి. అయితే ఇక ఇప్పుడు మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు ఖుర్రుమ్ మంజూర్. అయితే ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో  మాట మార్చాడు అని తెలుస్తుంది. కోహ్లీతో పోల్చుకొని అతడిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని.. కేవలం తన విజయాల గురించి చెప్పుకోవడానికి మాత్రమే అలా మాట్లాడాను అంటూ తెలిపాడు. మీడియా కావాలని తన మాటను వక్రీకరించాయి అంటూ చెప్పుకొచ్చాడు.


 కోహ్లీతో తనకు పోలిక లేదు అంటూ చెప్పాడు. సెంచరీల నిష్పత్తి గురించి మాట్లాడుతూ కోహ్లీ కంటే నాకు గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. తను రెండో స్థానంలో ఉన్నాడని మాత్రమే చెప్పాను. తనతో నాకు అసలు పోలికే లేదు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఎన్నో మ్యాచ్లు ఆడాడు. గణంకాలతో కూడా సంబంధం లేదు. తను ఎప్పటికీ గొప్ప క్రికెట్ అంటూ ఖుర్రుమ్ మంజూర్  మాట మారుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. అదే సమయంలో తన గణాంకాలు విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: