
దీనితో జట్టులో ఫారిన్ ప్లేయర్స్ అందరూ కొత్తవాళ్లే. ఇక సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ గా సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ మార్ క్రామ్ ను ప్రకటించింది. ప్రస్తుతం మార్ క్రామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన సౌత్ ఆఫ్రికా టీ 20 లీగ్ లో టైటిల్ ను గెలిచిన కెప్టెన్ గా ఉన్నాడు. ఆ నమ్మకంతోనే కావ్య పాప మార్ క్రామ్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ జట్టులో ఉన్నా మరో ఆటగాడు హరీ బ్రూక్ గురించి ఇప్పుడు చర్చ్ జరుగుతోంది. ఇంగ్లాండ్ కు చెందిన ఈ యువ చిచ్చర పిడుగు ఇప్పుడు మూడు ఫార్మాట్ లలోనూ రెగ్యులర్ కీలక ఆటగాడుగా కొనసాగుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా సరే బంతిని బాదడమే పనిగా పెట్టుకుని బౌలర్ల పాలిట శాపంగా మారాడు.
ఆ మధ్యన పాకిస్తాన్ పై పాకిస్తాన్ లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన బ్రూక్ ఇపుడు న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ లో తన విశ్వరూపం చూపిస్తున్నాడు. రెండవ టెస్ట్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుని కేవలం 21 పరుగులకే మూడు వికెట్లను పడగొట్టి ఆధిపత్యాన్ని చూపించిన తరుణంలో క్రీజులోకి వచ్చిన హరీ బ్రూక్ జో రూట్ అండతో టీ 20 తీరుగా ఎడాపెడా బౌండరీలతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బ్రూక్ ఇప్పటి వరకు ఆడింది కేవలం ఆరు టెస్ట్ లే... అయినా ఎంతో అనుభవం ఉన్నా ఆటగాడిలా వికెట్ ఇవ్వకుండా సాలిడ్ బ్యాటింగ్ ను చూపిస్తున్నాడు.
తన కెరీర్ లో బెస్ట్ స్కోర్ 184 ను సాధించి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇతని ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు మరియు 5 సిక్సులు ఉన్నాయి. ఇప్పుడు హరీ బ్రూక్ సన్ రైజర్స్ జట్టులో ఉండడం... తెలుగు అభిమానులకు ఎంతో హుషారుగా ఉంది. మార్చ్ 31 నుండి జరగనున్న ఐపీఎల్ లో బ్రూక్ ఇదే విధంగా ఆడితే సన్ రైజర్స్ జట్టు రెండవసారి టైటిల్ ను అందుకోవడం పక్కా. మరి చూద్దాం బ్రూక్ ఏ విధంగా ఈ ఐపీఎల్ లో రాణిస్తాడో ?