బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ ను ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ సీజన్ 1 ను అయిదు జట్లతో ప్రారంభించింది, కాగా ఇప్పటికే లీగ్ దశ కూడా ముగుస్తోంది. ఇందులో టాప్ టీం గా ఉన్న ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ జట్టును ముందుకు తీసుకువెళుతోంది. ముంబై ఇండియన్స్ వరుసగా అయిదు మ్యాచ్ లను గెలుచుకుని మొదటిసారి ప్లే ఆఫ్ చేరిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఈ టీం లో హర్మన్ తో పాటుగా, భాటియా , మాథ్యూస్ , నటాలీ సీవర్ మరియు అమేలియా కేర్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. గత రెండు మ్యాచ్ ల ముందు వరకు ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్... వరుసగా రెండు ఓటములను ఎదుర్కొంది. ముంబై ఆడిన ఆరవ మ్యాచ్ లో యూపీ వారియర్స్ చేతిలో అయిదు వికెట్ల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది.

కాగా గత రాత్రి జరిగిన మరో మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఢిల్లీ బౌలర్లు ఎంతో కట్టుదిట్టమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న ముంబై ని టోర్నీలోనే తక్కువ స్కోర్ కు కట్టడి చేశారు. ఢిల్లీ బౌలర్లలో కప్ , జొనస్సేన్ మరియు శిఖా పాండేలు తలో రెండు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించారు.

ఛేదనలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ముంబై బౌలర్లను ఆది నుండి చీల్చి చెండాడారు.. ముఖ్యంగా షెపాలీ వర్మ అయితే 220 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసింది.. తాను చేసిన 33 పరుగులతో 6 ఫోర్లు మరియు 1 సిక్స్ ఉన్నాయి. ఆ తర్వాత క్యాప్సి రంగంలోకి దిగింది... ఈమె సిక్సర్ లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. తాను ఎదుర్కొన్న 17 బంతులలో 5 సిక్సులు మరియు ఒక ఫోర్ తో పరుగులు చేసి ఢిల్లీ ని కేవలం 9 ఓవర్ లలోనే  విజయ తీరాలకు చేర్చింది. దీనితో ఢిల్లీ మొదటి స్థానానికి ఎగబాకింది. అలా ముంబై తాము ఆడిన లాస్ట్ రెండు మ్యాచ్ లలో ఓడిపోయి వెనుకబడిపోయింది. మరి చూద్దాం ఇక మిగిలిన ఒక మ్యాచ్ లో గెలిచి డైరెక్ట్ గా ఫైనల్ చేరుతుందా లేదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: