
ఇకపోతే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఇటీవల ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. భారత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్లు అంటూ చెప్పుకొచ్చాడు అబ్దుల్ రజాక్. వీరిద్దరిని ఔట్ చేసేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లు చాలా కష్టపడేవారు అంటూ గుర్తు చేసుకున్నాడు. ఓపనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంతో ప్రమాదకరమైన బ్యాట్స్మెన్.. ఇక సచిన్ తక్కువేమీ కాదు. వీరిద్దరి జోడికి వ్యతిరేకంగా పాక్ జట్టు ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఇద్దరు బ్యాట్స్మెన్లను అవుట్ చేస్తే మ్యాచ్ గెలుస్తామన్నది మా ప్లాన్.
అయితే సచిన్, సెహ్వాగ్ తో పాటు యువరాజ్ సింగ్ కూడా పాకిస్తాన్ ను ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు. ఈ ముగ్గురిని అవుట్ చేస్తే మా జట్టు బౌలర్లు గొప్పగా ఫీల్ అయ్యేవారు. ఇక బౌలింగ్లో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లను ఫేస్ చేయడానికి పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు తెగ ఇబ్బంది పడిపోయేవారు అంటూ అబ్దుల్ రజాక్ గుర్తు చేశాడు. సచిన్ సెహ్వాగ్ ఓపెనింగ్ జోడి పాకిస్తాన్ పై ఎన్నో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ముల్తాన్ లో పాకిస్తాన్ పై సచిన్ 194 పరుగులు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో అతను డబ్బులు సెంచరీ కోల్పోయాడు. ఇక ముల్తాన్ లో జరిగిన మ్యాచ్ లో సచిన్ సెహ్వాగ్ ఓపెనింగ్ జోడి దెబ్బకు పాక్ ఆటగాళ్లు వణికిపోయారు అంటూ అబ్దుల్ రజాక్ చెప్పుకొచ్చాడు.