
ఆదివారం రోజు గుజరాత్ టైటాన్స్ ఈ విషయాన్ని ప్రకటించడంతో గుజరాత్ అభిమానులంతా కూడా ఆందోళనలో మునిగితేలారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో ఆట మధ్యలో కేన్స్ వెను తిరగడంతో అతని స్థానంలో సాయి సుదర్శన్ అనే మరో ప్లేయర్ తో గేమ్ ని కొనసాగించి విజయం సాధించారు గుజరాత్ టైటాన్స్. ఇక కేన్స్ మోకాలి గాయం తీవ్రంగా ఉందని ఐపిఎల్ సీజన్ 2023 కి దూరమైనప్పటికీ ఈ ఏడాది చివర లో ప్రపంచ వరల్డ్ కప్ భారత వేదికగా జరుగుతుండగా అందుబాటులోకి రావాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది.
ఇక గుజరాత్ టైటాన్స్ సోమవారం రోజున లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నైలోనే చెపాక్ స్టేడియంలో రెండో మ్యాచ్ ఆడనుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో శుక్రవారం రోజు తలపడి గాయపడిన కేన్స్ స్థానంలో ఇప్పటివరకు ఎవరిని తీసుకుంటున్నట్టు గుజరాత్ టైటాన్స్ ప్రకటించలేదు. కింగ్స్ లాంటి ఒక స్టార్ ఆటగాడు లేకపోవడం గుజరాత్ రైట్ టైటాన్స్ కి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. గుజరాత్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలంటే కాస్త గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో కేంస్ గాయపడటం వారికి తలనొప్పి వ్యవహారంగా మారింది.