ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2023 సీజన్‌లో లీగ్ దశ పూర్తయ్యింది. హోరా హోరీ పోరాటాలు ఫ్యాన్స్ కు కనువిందు చేశాయి. చివరకు నాలుగు టీంలు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా ఆరు టీంలు ఇంటి ముఖం పట్టాయి.గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌లలో ఐపీఎల్ టైటిల్‌ను సాధించేది ఎవరో ఇంకా మరో నాలుగు మ్యాచుల్లో తేలనుంది.మే 23 వ తేదీన మంగళవారం నాటి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచులు స్టార్ట్ కానున్నాయి. టాప్‌-2లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ కి ఫైనల్ చేరుకునేందుకు రెండు ఛాన్స్ లు ఉంటాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లను ఆడనున్నాయి.ఇక క్వాలిఫైయర్ 1లో చెన్నైలోని చెపాక్ వేదికగా మే 23 వ తేదీన గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ టీం మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీం నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.ఓడిపోయిన టీం కి మరో అవకాశం ఉంటుంది.


ఎలిమినేటర్ లో మే 24 బుధవారం నాడు లక్నోసూపర్ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ ఆడనుండగా ఓడిన జట్టు మాత్రం ఇక ఇంటి ముఖం పడుతుంది. ఇంకా ఈ మ్యాచ్‌కు కూడా చెన్నైలోని చెపాక్ స్టేడియమే అతిథ్యం ఇవ్వనుంది.క్వాలిఫైయర్ 2 లో మే 26 శుక్రవారం క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు ఇంకా ఎలిమినేటర్‌లో గెలిచిన జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది.ఇక ఇందులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంకా ఈ మ్యాచ్‌ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మే 28 ఆదివారం నాడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఫస్ట్ క్వాలిపైయర్‌లో గెలిచిన జట్టు, రెండో క్వాలిఫైయర్‌లో విజయం సాధించిన జట్టుకు మధ్య ఫైనల్ మ్యాచ్ అనేది జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కూడా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగుతుంది.ఇక అన్ని మ్యాచ్‌లు కూడా రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: