ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు, ప్రతిపక్షాల నేతలకు ఎల్లోమీడియానే ప్రచారమనే ఆక్సిజన్ అందిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి  ప్రతిపక్షాలు దాదాపు కుదేలైపోయాయి.  మొన్నటి ఎన్నికల దెబ్బకు టిడిపి అయితే దాదాపు నేలమట్టమైపోయినట్లే. ఇక బిజెపి, జనసేన, కాంగ్రెస్, వామపక్షాల గురించైతే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ పరిస్ధితుల్లోనే పాలనలో దూసుకుపోతున్న జగన్ ను ఎదుర్కొనేందుకు  చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నాడు.

 

తానొక్కడే జగన్ ను ఎదుర్కోలేనన్న విషయం అర్ధమైపోవటంతోనే చంద్రబాబు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ బలాన్ని అరువు తీసుకున్నాడు.  చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే పై నేతల్లో ఎవరికి కూడా జగన్ను నిలువరించే శక్తి లేదని. అందుకనే  తనకు మద్దతుగా ఎంతమంది నిలబడుతున్నా చంద్రబాబు గట్టి పోటి ఇవ్వలేకపోతున్నాడు.

 

ఈ నేపధ్యంలో చంద్రబాబుకైనా ఇతర ప్రతిపక్షాలకైనా మద్దతుగా నిలబడింది ఒక్క ఎల్లోమీడియా మాత్రమే. ప్రతిపక్షాలను, ఎల్లోమీడియాను జనాలు పెద్దగా విశ్వసించటం లేదు. అయితే జగన్ కు వ్యతిరేకంగా కనీసం తమ గొంతుకను వినిపించేందుకైనా ఎల్లోమీడియా పనికొస్తోందనే అందరూ తృప్తి పడుతున్నారు. అందుకనే వీళ్ళందిరికీ ఎల్లోమీడియానే ఆక్సిజన్ అందిస్తోందనే ప్రచారం కూడా నిజమేనేమో. అసలు ఎల్లోమీడియా కూడా  పట్టించుకోకపోతే వీళ్ళ పరిస్ధితి మరీ దుర్భరంగా తయారయ్యేది ఈ పాటికే.

 

ఇక్కడే ఎల్లోమీడియా రెండంచెల విధానాన్ని అవలంభిస్తోంది. మొదటిదేమో చంద్రబాబు, ప్రతిపక్షాల నేతలకు జాకీలేసి లేపే ప్రయత్నం. ఇక రెండోదేమో జగన్ పై బురద చల్లేయటం. పాపం ఎల్లోమీడియా ఎంతగా ప్రయత్నిస్తున్నా రెండు విధానాలు కూడా పెద్దగా సానుకూల ఫలితాలు ఇవ్వటం లేదనే చెప్పాలి. ఇసుక కొరత విషయంలో ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ఎంత రాద్దాంతం చేసినా జనాలు పట్టించుకోలేదు.  

 

ఇంగ్లీషుమీడియంపై ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేసిన రాద్దాంతంపై జనాలే తిరగబడ్డారు. ఇదే విషయమై జనాల్లో తమపై వ్యతిరేకత వస్తోందని పార్టీ నేతలు ఇచ్చిన ఫీడ్ కారణంగానే చంద్రబాబు యూటర్న్ తీసుకుని చివరకు మద్దతిచ్చాడు. చంద్రబాబు ఎప్పుడైతే మద్దతిచ్చాడో అప్పటి నుండే ఎల్లోమీడియాలో కూడా వ్యతిరేక కథనాలు తగ్గిపోయాయి.

 

అలాగే మూడు రాజధానుల అంశాన్ని కూడా ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా కలిసే యాగీ చేశాయి. అయితే ఎంత గోల చేసినా రాజధాని ప్రాంతంలోనే చాలా గ్రామాల జనాలు పట్టించుకోలేదు. అందుకనే జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా కేవలం ఆరేడు గ్రామాల జనాలు అందులోను చంద్రబాబు సామాజికవర్గం వాళ్ళే గోల చేస్తున్నారు. 

 

తాజాగా కరోనా వైరస్ విషయంలో కూడా  ప్రతిపక్షాల గొంతులను ఎల్లోమీడయా ఎంతగా హైలైట్ చేద్దామన్నా సాధ్యం కావటం లేదు. ఎందుకంటే ప్రజాక్షేమం కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ అందరూ గమనిస్తునే ఉన్నారు.  మొత్తం మీద ఎల్లోమీడియానే గనుక ఆక్సిజన్ అందుతుండకపోతే  వీళ్ళను జనాలు ఈ పాటికే మరచిపోయేవారేమో కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: