సర్వ రోగాలకు మందొకటే అన్నట్లుగా తయారైంది రాజధాని అమరావతి వ్యవహారం. రాష్ట్రమంతా అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని డిమండ్ చేస్తున్నారని ఒకవైపు చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో అమరావతి శాసన రాజధానిగా మాత్రమే ఉంటుందని,  విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేశాడు. ఇద్దరిలో ఎవరి ఆలోచన కరెక్టు ? ఎవరిదంటే జగన్ దే కరెక్టని చెప్పాల్సిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉన్నాడు కాబట్టి తను ఏమనుకుంటే దాదాపు అదే జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు అంతా తనిష్టం వచ్చినట్లే నడిపించుకున్నాడు.

 

రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసేముందు చంద్రబాబు అఖిలపక్ష సమావేశం పెట్టడమో, లేకపోతే జనాభిప్రాయం సేకరించటమో చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే.  ఎవరో తనకు కావాల్సిన నలుగురితో కూర్చుని మాట్లాడేసుకుని డిసైడ్ చేసేసి అసెంబ్లీలో ప్రకటించేశాడంతే. కాబట్టి వేరే దారిలేక వైసిపి కూడా మద్దతిచ్చింది. అయితే రాజధాని నిర్మాణంలో వైసిపి మద్దతిచ్చినా చంద్రబాబు మాత్రం దుర్వినియోగం చేసుకున్నాడు. విలువైన ఐదేళ్ళ కాలాన్ని చెడగొట్టుకున్నాడు. రాజధానిని అమరావతి నుండి వైజాగ్ కు తరలించాలనే ఆలోచన జగన్ కు వచ్చిందంటే అది చంద్రబాబు చేతకానితనమే. తన చేతకానితనానికి తనను తాను నిందించుకోవాల్సిందిపోయి జగన్ మీద పడి గోల చేస్తున్నాడు.

 

కరోనా వైరస్ సమస్య లేకపోతే ఈ పాటికే రాజధాని అమరావతి నుండి తరలిపోయేదనటంలో ఎవరికీ సందేహం లేదు.  అమరావతి పేరుతో 200 రోజులుగా ఉద్యమం జరుగుతున్నదని చంద్రబాబు+ఎల్లోమీడియా  చెప్పటం  అంతా  అబద్ధమే. ఉద్యమం అంతా కేవలం ఎల్లోమీడియాలోను, జూమ్ కాన్ఫరెన్సుల్లో మాత్రమే జరుగుతోంది. అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని రాష్ట్రమంతా ఉద్యమాలు జరుగుతున్నదని చంద్రబాబు చెప్పటం నిజమేనా ? ఒకవేళ నిజమే అయితే  23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు  రాజీనామాలు చేస్తారా ? అనే ప్రశ్నను వైసిపి నేతలు సంధిస్తున్నారు.

 

టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గెలిచారు. కాబట్టి ప్రజల మద్దతు నిజంగానే ఉంటే మళ్ళీ జనాలు రాజీనామాలు చేసిన టిడిపి ఎంఎల్ఏలు, ఎంపిలనే తిరిగి గెలిపించాలి కదా ? మరి రాజీనామాలు చేసేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నాడా ? రాజీనామాలు చేయమని చంద్రబాబు చెబితే మిగిలిన వాళ్ళు అంగీకరిస్తారా ? అన్నదే ఇపుడు ప్రధాన ప్రశ్న. పోనీ అలా కాదని అనుకున్నా మంత్రి అవంతీ శ్రీనివాస్ చెప్పినట్లుగా వైజాగ్ నగరంలో గెలిచిన నలుగురు ఎంఎల్ఏలతో అయినా చంద్రబాబు రాజీనామాలు చేయిస్తాడా ? ఉప ఎన్నికల్లో మళ్ళీ టిడిపి ఎంఎల్ఏలు గెలిస్తే  వైజాగ్ ను రాజధానిగా జనాలు అంగీకరించటం లేదని అవంతి విసిరిన సవాలు సబబుగానే ఉంది.  మరి చంద్రబాబు అంత ధైర్యం చేస్తాడా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: