తెలంగాణ లో సీఎం కేసీఆర్ వలన కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఇబ్బంది పడుతుంది ఏంటి అని ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నేతలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అనేక విధాలుగా సహాయసహకారాలు అందిస్తూ ఉన్నారు అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిన వాతావరణం ఎక్కడా లేదు అనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నా సరే ఆయనకు పూర్తి స్థాయిలో కొంతమంది నుంచి సహకారం అందడం లేదు.

 దీని వలన చాలామంది నేతలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారని చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డి విషయంలో కొన్ని కొన్ని అంశాలు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్ర అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ ఉన్న నేతలు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు అనే అభిప్రాయం కూడా ఉంది.

 ఈ తరుణంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉంటాయి. కానీ దీనిని అనుకూలంగా మార్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే తమను ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి విషయంలో పాదయాత్ర చేయవద్దు అని ఢిల్లీ వెళ్లి ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని  సమాచారం. రేవంత్ రెడ్డి స్థానంలో ఎవరు పాదయాత్ర చేసినా తమకు పర్వాలేదు అని చెబుతున్నారట కాంగ్రెస్ పార్టీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: