మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు గంటా శ్రీనివాసరావు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చాలావరకు సన్నిహితంగా ఉంటున్నారని టాక్. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో గంటా శ్రీనివాసరావు పార్టీ మారే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానించారు. కానీ ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు నుంచి ఎటువంటి స్పష్టత కూడా రాలేదు.
అయితే త్వరలో గంటా శ్రీనివాసరావు వైసీపీ లోకి వెళ్లి పోవడానికి మార్గం సుగమం చేసుకున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి జనసేన పార్టీలోకి వెళ్ళాలని భావించిన వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన అంచనా వేసుకున్నారు. ఇక భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ ముందుకు వెళ్ళడంతో రాష్ట్రంలో భవిష్యత్ లేదనే అభిప్రాయం కూడా కొంతమంది ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అని టాక్. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు జనసేన నాకెందుకులే అనుకున్నారని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి