సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఇక అంతే స్థాయిలో విలన్ లకు కూడా క్రేజ్ ఉండడం సహజం. సినిమాలలో విలన్ పాత్రలో అదరగొట్టిన వీరు నిజజీవితంలో మాత్రం ఎంతో దయ కలిగిన మహానుభావులు. ఇక అలాంటి వారిలో అలనాటి నటుడు విలన్ గా మెప్పించి, ప్రేక్షకులను భయపెట్టి, అలరించిన రామిరెడ్డి గారు కూడా ఒకరు. ఈయన తీసే ప్రతి సినిమాలో కూడా విలన్ గెటప్ లో కనిపించి, ప్రేక్షకుల చేత గొప్ప నటుడిగా పేరుప్రఖ్యాతులు పొందాడు. అయితే ఈయన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రామి రెడ్డి పూర్తి పేరు గంగసాని రామిరెడ్డి . భారతదేశపు అన్ని భాషలలో దాదాపు 250 చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రామిరెడ్డి చిత్తూరు జిల్లాలోని వాయల్పాడులో ఓబులం వారి పల్లె లో జన్మించారు. ఈయన నటుడు కాక ముందు ఒక వార్తా పత్రికకు విలేకరిగా పనిచేసే వారు. ఇక ఈయనకు వివాహం అనంతరం ఇద్దరు కూతుళ్లు ,ఒక కుమారుడు జన్మించారు. ఇక తర్వాత సినిమాలలోకి ప్రవేశించారు. అలా మొట్టమొదటిసారిగా యాంగ్రీ మాన్ రాజశేఖర్ హీరోగా నటించిన అంకుశం చిత్రం ద్వారా , మొదటిసారి విలన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రామిరెడ్డి.
ఇక ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఇక ఈయన పేరు కాస్త అంకుశం రామిరెడ్డి గా ముద్ర పడిపోయింది. ఇక తరువాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్ పురీ వంటి భాషా చిత్రాలలో విలన్ గా నటించారు. తెలుగులో అంకుశం, ఒసేయ్ రాములమ్మా, పెద్దరికం, నాగ ప్రతిష్ట, అమ్మోరు, అనగనగా ఒక రోజు, అడవి చుక్క, తెలుగోడు, జగద్గురు శ్రీ షిరిడి సాయి బాబా.. వంటి పలు చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.
రామి రెడ్డి చివరి దశలో మూత్రపిండాల వ్యాధి తో బాధపడుతూ మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయట పడ్డారు. కానీ అదే వ్యాధి విషమించడంతో ఏప్రిల్ 14 2011 న హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి