టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జయచిత్ర . ఆమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషలో కూడా నటించి తన సత్తా చాటుకుంది. ఆమె 200 పైగా సినిమాలలో నటించి పేక్షకులను అలరించారు. అంతేకాదు.. అప్పట్లో ఈ హీరోయిన్ కి ఒక ప్రత్యేకమైన వాయిస్ ఉండడంతో.. ఈమె చెప్పే డైలాగులకు ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటూ ఉండేది. ఆమె సినిమా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను జయచిత్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

జయచిత్ర ఎప్పుడు ఎక్కువగా నా పాత్రకి సంబంధించిన విషయాలపైనే దృష్టి పెట్టేదానిని. నా పాత్ర ఏమిటి? ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి? ఎలా చెప్పాలి? ఎలాంటి షాట్స్ పెడుతున్నారు? ఇలా సెట్లో నేను నా పాత్రను గురించే ఆలోచన చేసేదానిని చెప్పుకొచ్చింది. అయితే.. అప్పట్లో కొంతమంది హీరోయిన్ల డేట్స్ కోసం హీరోలు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. ఆ జాబితాలో తాను కూడా ఉన్నట్లు తెలిపింది.

అంతేకాదు.. జయచిత్ర ల్లవారు జామున 2 గంటలకి నిద్రపోయి 4 గంటలకు లేచి షూటింగుకి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయని వెల్లడించింది. నిద్ర సరిపోక ఆమె ఫ్లైట్ లో నిద్రపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయంట. ఇక ఒకే ఏడాదిలో నేను 23 సినిమాలలో ఐదు షిఫ్ట్ లు చేసినట్లు పేర్కొంది. అయితే ఆమె దేవుడిచ్చిన అవకాశం అనుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని కష్టపడి పని చేశానని చెప్పుకొచ్చింది. జయచిత్ర అప్పట్లో స్టార్ హీరోలకు ధీటుగా రాణించారు. ఇక అప్పట్లోనే ఆమె లక్ష నుంచి 3 లక్షల వరకూ పారితోషికం తీసుకున్నట్లు తెలిపింది. ఇక కొన్ని సందర్భాలలో స్టార్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ కి సమానంగా తీసుకుందట. ఆమె ఎప్పడు డబ్బు కోసం పని చేయలేదని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: