దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పరస్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు. ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయ ప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు. అలాగే, దేవుని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూర్చోకూడదు. ఆలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు అందరూ సమానులే అని భావించాలి.