మనకు ఉన్న యుగాలలో త్రేతాయుగం కూడా ఒకటి. ఈ యుగంలో శ్రీమహావిష్ణువే లోక కల్యాణం కోసం రాముడిగా అవతరించి, దుష్ట శిక్షణ చేశాడని రామాయణం అనే గ్రంధంలో తెలుపబడి ఉంది. శ్రీరాముడు గురించి మనము ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఆ మహానుభావుడి చరిత్ర విన్న వారికి కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. తన జీవితం కాలంలో ఎప్పుడూ కూడా తండ్రి మాటను కాదని చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు.