ఏ కథకైనా, ఏ నాటకానికైనా మొదలున్నట్లే తుది (అంతం) అనేది కూడా ఉంటుంది కదా ! అది సుఖాంతమూ కావచ్చు లేదా దు:ఖాంతమైనా కావచ్చు. ఒక వేళ కథలకు, నాటకాలకు అంతంమనేది లేకుండా అలానేకొన సాగుతున్నట్లయితే అవి సంతోషాన్ని కలిగించవు కదా విసుగుని పుట్టిస్తాయి.
మానవుని జీవితం కూడా అదే విధముగా ఉంటుంది. కనుకనే సృష్టించడమూ మళ్ళీ నశింప చేయడమూ అనేది జరుగుతున్నది. జీవులను నశింపజేయక పోయి నట్లయితే ఈ మాయా ప్రకృతి పాత్ర పరిమితమే అవుతుంది. కనుక అనంతంగా సాగే ఈ నాటకానికి ఈ బగవల్లీలల అవసరం ఎంతైనా ఉన్నదని తెలుస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: